- ఒక్క రూపాయి కేటాయించకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా
రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ పర్యటనలో భాగంగా రాజరాజేశ్వర స్వామి గుడి మెట్ల మీద దేవస్థానానికి ఏడాదికి 100 కోట్లు కేటాయిస్తానని, మిడ్ మానేరు ముంపు బాధితులకు 5లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికి ఎనిమిది ఏళ్లు గడుస్తున్న సందర్భంగా, నేడు వేములవాడ రాజన్న ఆలయం ముందు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకత్వంతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది.