- ఏ ఉద్యోగి అయినా విధులు సక్రమంగా నిర్వహించినప్పుడే గుర్తింపు …
- ఎంపీపీ కొత్త వినీత.. జెడ్పిటిసి గీకురు రవీందర్..
కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలంలో తహసిల్దార్ గా పనిచేసిన సయ్యద్ ముబీన్ అహ్మద్ బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేశారు.రెవెన్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిద శాఖల ఉద్యోగులు అయనను పెద్ద ఎత్తున మెమొంటో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి,జడ్పీటీసీ గీకురు రవీందర్ లు మాట్లాడుతూ… తన పదవీకాలంలో పేదలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశాడని, మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారని, ఆయన పనితీరుతో మండలంలో తనదైన ముద్ర వేశారని అన్నారు.ఎంత పెద్ద సమస్య అయినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటిని అధిగమించి సమస్యల పరిష్కారానికి కృషి చేశాడని, జవాబిదారితనానికి మారుపేరుగా తహసీల్దారు ముబీన్ అహ్మద్ నిలిచాడని మండలంలో అత్యధిక రిజిస్ట్రేషన్లతో పాటు ధరణి సమస్యలు పరిష్కరించడం తోపాటు విద్యార్థులకు కులం ఆదాయం ధ్రువీకరణ పత్రాలు అందజేయడంలో ముందు ఉన్నారు.పాత్రికేయులు, టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా నాయకులు జేరుపోతుల వెంకటస్వామి పేర్కొన్నారు. లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో చిగురుమామిడి కి వచ్చి నేటికీ మూడు సంవత్సరాలు రైతులకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో భూ సమస్యలు పరిష్కరిస్తూ దిగ్విజయంగా మండలంలో తన పదవి పూర్తి చేసుకున్న తహసిల్దార్ కు ఇంత పెద్ద ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు అయిన పనితీరుకు నిదర్శనం అన్నారు. ఏ ఉద్యోగి అయినా బదిలీ తప్పనిసరి అని అందులో భాగంగానే కలెక్టరేట్ కు బదిలీ అయ్యారన్నారు. ఇక్కడ పనిచేసిన తాసిల్దారులలో అత్యధిక కాలం పనిచేసిన తాసిల్దారుగా రికార్డ్ సృష్టించారు. అనంతరం ముబీన్ అహ్మద్ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో సహకరించిన మండలంలోని 17 గ్రామాల ప్రజలకు వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధిలకు,కింది స్థాయి ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పెద్ద ఎత్తున శాలువా మెమొంటోలతో ఘనంగా సన్మానించి వీడుకోలు పలికారు.నూతన తాసిల్దార్ జయంత్ కు సైతం శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి,వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, తహసీల్దారు జినుక జయంత్, ఎంపీడీవో మామిడిపల్లి నర్సయ్య, నయాబ్ తహసీల్దారు రవికుమార్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షులు పెనుకుల తిరుపతి, ఎంపీటీసీలు పోరం మండలాధ్యక్షులు మిట్టపల్లి మల్లేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మామిడి అంజయ్య సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు చెప్పాలా మమత సనిల వెంకటేశం బోయిన శ్రీనివాస్ , రేషన్ డిలర్స్,వ్యవసాయ శాఖ అధికారులు,రెవెన్యూ సిబ్బంది గిరిధవర్లు పూదరి రాజు, బంగారు శైలజ, వీఆర్ఏలు ఆఫీస్ సిబ్బంది మీసేవ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.