పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నిగళ్ళ గ్రామంలో మాదిగల జన జాగృతి సభను విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పేరుకు రామయ్య మాదిగ పిలుపునిచ్చారు ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరములుగా ఎస్సీ వర్గీకరణ విషయంలో పాలకులు నిర్లక్ష్యం చేసారు. రాబోవు రోజులలో ఎస్సీ వర్గీకరణనకు మద్దతు తెలపాలని లేనియెడల వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్తామనీ హెచ్చరించారు. అంతేకాకుండా రాబోవు ఎన్నికల్లో మాదిగలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జులై నెల ఏడో తారీఖున గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్ విజయవాడలో జరుగు సభకు లక్షలాదిగా మాదిగలు జన జాగృతి సబ మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతుంది. పల్నాడు నుంచి వేలాదిగా మాదిగ సహోదరులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మామిడి అన్నారావు పేరు పోగు సాగరు మామిడి సాల్మన్ రాజు మామిడి కిరణ్ మామిడి సాగర్ మామిడి జాన్, దర్శనాల ప్రసాదు, ఇష్టం శ్రీను, కోటేశ్వరావు, చిన్న సాగరు నాగేశ్వరరావు, యోహాను మరే బాబు, ఎలీషా, జాన్, ఇనుముక్కల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు