కరీంనగర్ జిల్లా: స్వచ్ఛభారత్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామానికి ఇంటర్నేషనల్ అవార్డు ప్రశంస పత్రం లభించింది. సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాల దిశ నిర్దేశం మారాయి. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, మండలాధికారులు, గ్రామ పాలకవర్గం సభ్యులు, ప్రజల సహకారంతో గ్రామానికి ఐఎస్ఓ ఇంటర్నేషనల్ అవార్డు రావడం సంతోషం గా ఉంది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వనంలో పిల్లల ఆట వస్తువులు, డంపింగ్ యార్డ్, తడి చెత్త పొడి చెత్త కంపోస్ట్ షెడ్, రైతు వేదిక, వంద శాతం ఇంకుడు గుంతలు, అక్షరాస్యత, మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య పనులు, స్మశాన వాటిక, నాప్కిన్ బర్నింగ్ షెడ్, నర్సరీ, నిత్యం త్రాగునీరు ఇతర అంశాలపై బేశు గా ఉన్నాయని ఇటీవల అధికారులు వెల్లడించారు. గ్రామానికి జిల్లా, రాష్ట్ర, కేంద్ర బృందాలు వచ్చి అన్ని పనులను పరిశీలించి బాగున్నాయని కితాబు పలికారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా కరీంనగర్ ఆడిటోరియంలో బీసీ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారుల చేతుల మీదుగా ఈరోజు అవార్డు, ప్రశంసా పత్రం తీసుకోవడం జరిగింది. ఖాసీంపేట గ్రామానికి అవార్డు రావడం పట్ల గ్రామ పాలకులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, మండల అధికారులు గ్రామ ప్రజల సహాయ సహకారంతో మునుముందు మరిన్ని అవార్డులు తీసుకుంటామని సర్పంచి తెలిపారు.