- ఆరు రోజులు అమలుకు నోచుకోని మధ్యాహ్న భోజన పథకం
- ఆకలితో ఇంటికి పరుగులు తీస్తున్న విద్యార్థులు.
- ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపం.
అల్లూరి జిల్లా,హుకుంపేట, ది రిపోర్టర్: మండలంలో బోడిగపుట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వారం రోజులుగా అమలకు నోచుకోలేదు. మండలంలోని రంగశీల పంచాయతీ బోడిగపుట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత వారం రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి ఇవ్వడం లేదు. ప్రతిరోజు ఉపాధ్యాయుడు విధులకు వస్తున్నారు గాని భోజనం ఎందుకు ఇవ్వటం లేదన్న విషయాన్ని ప్రశ్నించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఎందుకు ఇవ్వటం లేదని పలువురు తల్లిదండ్రులు,కమిటీ సభ్యులు ఉపాధ్యాయుని అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్పలేదని తెలిపారు. ప్రతి ఎలిమెంటరీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు రుచికరమైన భోజనాలు ఇవ్వాలి. దీంతోపాటు రాగి జావా తదితర మెనులను అమలు చేయాల్సి ఉండగా దానికి భిన్నంగా ఈ పాఠశాలలో సాగుతుంది. వారం రోజులుగా విద్యార్థులు ఆకలితో ఇంటికి పరుగులు తీస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ లోపం వల్ల ఉన్నత అధికారులు పాఠశాలలకు సందర్శించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లాకి కూతవేట్టు దూరంలో సమస్యలు తలెత్తునయి అంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఇంకా గోరంగా ఉంటుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు మధ్యన భోజన పథకం ద్వారా విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.