కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన నాగవల్లి లచ్చవ్వ (80 ) సోమవారం వ్యవసాయ బావిలో పడి మృతి చెందినదని, గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇంటిలోనే ఉంటుంది. సోమవారం ఇంటి నుండి బయటకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందినదని కొడుకు నాగవెల్లి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు.