కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లె గ్రామంలో ముదిరాజ్ సంఘం కుల బంధువులు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు, మహిళలు బోనం నెత్తిన పెట్టుకొని శివసత్తుల పూనకాల మధ్య వాడవాడలో తిరుగుతూ డప్పు చప్పుల మధ్య గ్రామ శివారులోని పోచమ్మ దేవాలయం వద్దకు చేరుకొని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు దాసరి వెంకటయ్య, అధ్యక్షులు దాసరి రాయమల్లు, ఉపాధ్యక్షులు గట్టు శ్రీశైలం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గట్టు నాగయ్య,ఉపాధ్యక్షుడు గట్టు శ్రీశైలం,ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీనివాస్, డైరెక్టర్లు, మహిళలు యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.