- నివాళులర్పించిన గడ్డం నాగరాజు,సొల్లు అజయ్ వర్మ
కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజకవర్గం మనకొండూర్ మండల కేంద్రంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ,బిజెపి మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. గడ్డం నాగరాజు మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప విద్యావేత్త గొప్ప దేశభక్తుడు ప్రముఖ జాతీయవాద నేతలలో ఒకరు దేశంలో తొలి హిందూ వాద రాజకీయ పార్టీని స్థాపించిన నేత ఎన్నో ఉన్నత పదవులను అలంకరించిన వ్యక్తి జనసంగ్ పార్టీని స్థాపించిన గొప్ప నాయకుడు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన వ్యక్తి 1960 70 దశకంలో భారతీయ జనసంఘ్ పార్టీకి ఆ తరువాత భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తోడ్పడిన అటల్ బీహార్ వాజ్ పాయ్ గారికి మార్గనిర్దేశం చేసిన గొప్ప నేత హిందుత్వం కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి అఖండ భారతావని నినాదాన్ని ఎలుగెత్తి చాటిన నిజమైన దేశభక్తుడు జూన్ 23 1953 పోలీస్ కస్టడీలో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణం పై ఇప్పటికీ ఏలాంటి విచారణ జరగలేదు ఆయన మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీనే అఖండ భారతావని కోసం ఆయన ఆలోచనలను ఆయన ఆశయాలను మనమందరం ముందుకు తీసుకు వెళ్దాం అని చెప్పి ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్, సెక్రెటరీ సొన్నాకుల శ్రీనివాస్, అధ్యక్షులు డాక్టర్ రమేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ప్రదీప్, మండల నాయకులు రమేష్, బీజేవైఎం మండల కార్యదర్శి బోయిని అభిషేక్, నాయకులు బోయిని హరీష్, కొంకటి అనిల్, రమేష్ తదితరులు ఉన్నారు.