సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం, వివరాల్లోకి వెళ్తే నిన్న ఒక ఛానల్ రిపోర్టర్ ని బెదిరిస్తూ, కిడ్నప్ చేసి కులాలను కించపరుస్తూ, తల్లి చెల్లి అని తేడాలేకుండా ఇష్టమోచ్చిన బూతులు తిడితే ఊరుకునేది లేదు. గతములో గవర్నర్ గారిని కూడా ఇలాగె తిట్టారు. నేడు ముదిరాజ్ కులస్తులను కించాపరుస్తున్నారు.ఆంటూ ముదిరాజ్ కుల సబ్యులకు క్షమాపణ చెప్పి మరోసారి కులాలను కించపరచనని తెలియజేయాలి. అంటూ బెజ్జంకి మండల కేంద్రం డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ కూడలిలో దిష్టిబొమ్మ దహనం చేసిన ముదిరాజ్ కులస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,దొరల అహంకారాన్ని ప్రజల మీద చూపిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. వెంటనే క్షమాపణ చెప్పక పోతే అడుగడుగునా అడ్డుకుని బాడితపూజ జేస్తం బిడ్డ మాటలు జర జాగ్రత్త అని హెచ్చరించిన ముదిరాజ్ ముద్దుబిడ్డ గూడెల్లి శ్రీకాంత్ దొరల పంచన చేరి వాపును చూసి బలుపు అనుకుని జాతి అహంకారంతో విర్రవీగుతున్న కౌశిక్ రెడ్డి,వ్యక్తిని ఏమైనా అనుకో అది ఇద్దరి వైరంకానీ కులాల పేరున దూషణలకు దిగితే ఏ కులమైన చూస్తూ ఊరుకోము క్షమాపణ చెప్పకుండా ప్రజల్లోకి వస్తే బట్టలు విప్పి కొట్టే రోజులు ముందున్నాయి. అహంకారాన్ని మాని చెంపలేసుకుని క్షమాపణ చెప్పండి అని ముక్కిస రత్నాకర్ రెడ్డి మండల కాంగ్రేస్ అధ్యక్షులు డిమాండ్ చేశారు.
ఈ దిష్టిబొమ్మ దహన కార్యక్రమములో మైల ప్రభాకర్, రోడ్డ మల్లేశం, శానగొండ శ్రావణ్ కుమార్, బోనగిరి రాజేందర్,దోనె వెంకటేశ్వర్ రావు, గూడెల్లి ఐలయ్య, బోనాల ఐలయ్య, రంగోని రాజు, బండిపల్లి రాజు, సంగేమ్ రాజేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
మరోపక్క బి ఆర్ ఎస్ నాయకులు మరియు మండల ముదిరాజ్ కుల సంఘ అధ్యక్షులు అక్కర వేణి పోచయ్య బెజ్జంకి మండల కేంద్రంలో పాడి కౌశిక్ రెడ్డి అహంకారపూరితమైన మాటలను పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి, పత్రికా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు జిల్లా మంత్రి అయిన హరీష్ రావుకు కౌశిక్ రెడ్డి వ్యవహారంలో జోక్యం చేసుకొని ముదిరాజ్ కులస్తులకు ఎమ్మెల్సీ తో క్షమాపణ చెప్పించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనికోరారు.ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.