ది రిపోర్టర్ టీవీ కథనానికి స్పందించిన అధికారులు . పల్నాడు జిల్లా కారంపూడి లో బస్టాండ్ సెంటర్ భారీ వర్షానికి జలమయమైంది. డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి వచ్చి బస్టాండ్ సెంటర్ మొత్త నీటి కుంటలా తయారైంది. దోమలు పెరిగిపోతున్నాయి. డ్రైన్ వాటర్ కూడా వర్షపు నీటితో కలవడం వలన భరించలేని వాసన, దోమ కాటుకు గురై ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశముందని ది రిపోర్టర్ టివి ఆదివారం కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు నేడు పనులు ప్రారంభించారు. ఇంకా పనులు పూర్తయిన తరువాత మరో వార్తతో మీ ముందుకొస్తాం.