మీడియాలో 15 సంవత్సరాల గొప్ప అనుభవం ఐదు సార్లు లాడ్లీ మీడియా,యూనిసెఫ్ లాంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి , లాంటి తెలుగు మీడియాలలో పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు తులసి చందు ను దూషిస్తూ బెదిరించడాన్ని ఈరోజు మీడియా ద్వారా పిడిఎం తదితర ప్రజా సంఘ నాయకులు ఖండించారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో ఆమె తన గళాన్ని నిర్భయంగా వినిపిస్తూ తీసుకున్న విధాన నిర్ణయాలు ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేశాయి నిజాన్ని నిర్భయంగా చెప్పే తులసి చందు లాంటి జర్నలిస్టుల అవసరం ఈ దేశానికి ఎంతో ఉన్నది ఆమె తన దృష్టికి ఏది అన్యాయం అనిపించిన తన చానల్ ద్వారా వివరిస్తూ, విశ్లేషిస్తూ, మంచిని సమర్థిస్తూ చెడును కడిగేస్తుంది అటువంటి నిజాయితీ గల నిస్వార్థ జర్నలిస్టు తులసి చందు ను కొందరు బెదిరించడం వెంబడించడం వేధించడం ప్రభుత్వాల పిరికితనం ఇటువంటి చర్యలను ప్రజాసంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక నిస్సహాయురాలు మహిళా జర్నలిస్టు ఇంతటి గొప్ప పోరాటం చేయడాన్ని మేము అభినందిస్తున్నాము భారతదేశ సాంస్కృతి సాటి ఆడవారిని గౌరవించడం నేర్పుతుంది కాబట్టి ఆమె నిస్వార్థ పోరాటానికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ మతంతో సంబంధం లేకుండా మానవతావాదంతో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధి జీవులు, మేధావులు, మానవతావాదులు అందరూ ఆమెకు అండగా బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.
కే శ్రీనివాసరావు. పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు,
కృష్ణ. ఎం సి పి ఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు,
జె కృష్ణ నాయక్ సిపిఐ పట్టణ కార్యదర్శి.