ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జూలై 1న రాష్ట్రంలోని 1297 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. అర్హులై ఉండి పథకాలు అందని వారికి ‘జగనన్న సురక్ష ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. మొత్తం 15 వేల సచివాలయాల్లో నిర్దేశిత తేదీల్లో క్యాంపులు నిర్వహిస్తారు. వారం ముందే క్యాంపు తేదీలపై మైక్‌లో ప్రచారం చేసి, లబ్ధిదారులకు టోకెన్లు జారీ చేయనున్నారు.