విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. రేపు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
అయితే ప్రతి ఏడాది పడుతోందతి కదా.. ఈ సారి కూడా నగదు వస్తుందని ధీమాగా ఉంటే కష్టమే..
ఒక్క రోజే టైం ఉంది కాబట్టి తప్పని సరిగా అలా చేయండి.. లేదంటే నగదు మిస్ అయ్యే ప్రమాదం.ఉంది
కచ్చితంగా మీ వలంటీర్ దగ్గర, లేదా దగ్గర్లో సచివాలయానికి వెళ్లి జాబితా చెక్ చేసుకోండి. అందులో పేరు లేకుంటే వెంటనే యాడ్ చేసుకోవాలి. అలాగే థంబ్ అపడేట్ చేసుకోవాలని సచివాలయ సిబ్బంది సూచిస్తున్నారు..
రేపు కురుపాంలో పర్యటించనునన్న మోహన్ రెడ్డి.. తరువాత అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. అక్కడే అమ్మ ఒడి నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. దాదాపు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ 15 వేలు చొప్పున నిధులు జమ కానున్నాయి.
ఇప్పటికే మూడు సార్లు ఈ నిధులను విడుదల చేసిన సీఎం.. నాలుగో విడత ఇచ్చేందుకు సిద్దమయ్యారు. నవరత్నాల అమల్లో భాగంగా ప్రతీ ఏటా విద్యా అమ్మఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.
అర్హుల జాబితా ఖరారు : అమ్మఒడి అర్హుల జాబితాను ఆన్ లైన్ లో ఉంచటంతో పాటుగా స్థానిక సచివాలయాల్లోనూ లబ్దిదారుల జాబితా అందుబాటులో ఉంచనున్నారు. అమ్మఒడి పథకం కింద మూడేళ్ల కాలంలో ఏపీ ప్రభుత్వం రూ.19,617 కోట్లు అందించింది. గత ఏడాది ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్ల రుపాయలను ముఖ్యమంత్రి ఖాతాలకు జమ చేసారు.
అమ్మఒడి పథకంలో తొలి ఏడాది తల్లులకు రూ.15 వేలు జమ చేసారు. గత ఏడాది నుంచి అమ్మఒడి కింద ఇచ్చే రూ 15 వేల నుంచి పాఠశాల..టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 2వేలు మినహాయిస్తోంది. ఒక్కొక్కరి ఖాతాలో రూ 13 వేలు మాత్రమే ఇప్పుడు జమ కానుంది
ఎవరు అర్హులు కారంటే?ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీల్లో చేరే వారికి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు వర్తిస్తాయని, వారికి అమ్మఒడి ఉండదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. కుటుంబ ఆదాయం రూ 12 వేలు, గ్రామాల్లో రూ 10 వేల లోపు ఉండే వారిని ఈ పధకంలో అర్హులుగా చేర్చారు. ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విద్యార్థుల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం ఆల్రెడీ అమ్మఒడి, విద్యాదీవెన వంటి కొన్ని పథకాలను అమలుచేస్తోంది. అలాగే.. నాడు-నేడు ద్వారా స్కూళ్లను సరికొత్తగా తీర్చిదిద్దుతోంది.