సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండలంలోని వడ్లూరి బేగంపేట పాఠశాలకు చెందిన ప్రస్తుత పదవ తరగతి విద్యార్థినిలు ఎగోళం నిహారిక, మరియు చిప్ప శ్రావ్య యూనియన్ బ్యాంక్ బెజ్జంకి శాఖ వారు నిర్వహించిన ఆల్ ఇండియన్ క్విజ్ 2023 క్విజ్ కాంపిటేషన్ పోటీలో జిల్లాలో ద్వితీయ బహుమతిని సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ సార్ తెలిపారు. అలాగే విద్యార్థులు అన్ని రంగాలలో చురుకుగా పాల్గొని వచ్చే వార్షిక పరీక్షలలో 10 జిపిఏ సాధించాలని విద్యార్థులకు సూచిస్తూ జిల్లా స్థాయిలో మన మండలాన్ని ద్వితీయ స్థాయిలో నిలిపినందుకు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
