contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“మహాజన సంపర్క్ అభియాన్” ఇంటింటికి బిజెపి : దోనె అశోక్

సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో మంగళవారం
మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని దోనె అశోక్ బిజెపి మండల అధ్యక్షులు అధ్వర్యంలో నిర్వహించగా మానకొండూరు నియోజకవర్గ నాయకులు సొల్లు అజయ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై ఇంటింటికి తిరుగుతూ ప్రధాని మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు అదేవిధంగా సుపరిపాలన కు చెందిన కరపత్రాలను పంచుతూ ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం తథ్యం అని అన్నారు, గ్రామాలలోని ఏ ఇంటికి వెళ్లినా కూడా బిజెపి నరేంద్ర మోడీ గారి పాలనకు బ్రహ్మరథం పడుతున్నారు అలాగే మేము ఎక్కడకు వెళ్లినా సంక్షేమ పథకాలను వివరిస్తూ మోడీ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అబద్దాల ప్రభుత్వం రాజ్జ్యం ఏలుతుంది ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు నేడు తెలంగాణ ప్రజానీకానికి ఈ ప్రభుత్వం ఏంచేసిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల తో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టే ఎన్ని కుటుంబాలను ఆదుకుందో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి నేడు తెలంగాణ మోడల్ గా దేశాన్ని ఉద్దరిస్తా అని పక్కరాష్ట్రాల పైన పడుతున్నాడు.
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ రుణమాఫీ చేసి రైతుల ను ఆదుకోవాలి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర కిసాన్ మోర్చ కార్యదర్శి కరివెద మహిపాల్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరై కేంద్రప్రభుత్వ పథకాలను ఇంటింటికి వివరించారు.

ఇట్టి కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చ నాయకులు రాచకొండ శ్రీధర్ రావు, మండల సీనియర్ నాయకులు కోండ్ల వెంకటేశం, మిట్టపెల్లీ అంజిరెడ్డి, ఉప్పులేటి లక్ష్మి, ఉప్పులేటి కిష్టయ్య, ఉప్పులేటి కొండయ్య, మామిడి మోహన్ రెడ్డి, మామిడి రాంరెడ్డి, వరుకొలు కనకయ్య మిట్టపెల్లి పులవ్వ, మిట్టపెళ్ళి భారత, వజ్రవ్వ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :