- మూడుసార్లు షోకాజ్ నోటీసులు
- కానీ జీతాలు జమ చేస్తున్న అధికారులు.
అల్లూరి జిల్లా, హుకుంపేట, ది రిపోర్టర్ :మండలంలోని చికుమద్దుల పంచాయతీ అంగన్వాడి సెంటర్లో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్ జె. చెల్లమ్మ తన విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని గ్రామస్తులు తెలిపిన పిర్యాదు (సమాచారం) మేరకు విజిట్ కు వెళ్లిన అంగన్వాడీ సూపర్వైజర్, సిడిపిఓలు నిర్ధారించి అమెకు మూడుసార్లు షాకాజ్ నోటీసులు ఇచ్చి కూడ 8 నెలలు జీతాలు వేయడం గమనర్హం. దీంతో సూపర్వైజర్, సిడిపిఓ పైన ఆరోపణలు చేస్తూ చికుమద్దుల అంగన్వాడి టీచర్ కుమారుడు కృష్ణారావు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై స్పందించిన ఐటీడీఎ పిఓ విచారణ కమిటీని నియమించి మంగళవారం గ్రామాన్ని పంపించారు. ఈ విచారణ కమిటీలో పాడేరు సిడిపిఓ బి.ఝాన్సీ రాణి, సూపర్వైజర్ అప్పల నరసమ్మ చికుమద్దుల గ్రామానికి వెళ్లి అంగన్వాడీ టీచర్ అవకతవకల పై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈమే 2021 సంవత్సరం నుంచి రికార్డులు రాయడం లేదని,టీచర్ యొక్క రోజు విధుల హజారు రికార్డులో సంతకాలు లేదవని నివేదికలో రాసుకోవడం జరిగిందని విచారణ కమిటీ సభ్యులు పాడేరు సిడిపిఓ బి.ఝాన్సీ రాణి, సూపర్వైజర్ అప్పల నరసమ్మ వారు తెలిపారు.అనంతరం గ్రామస్తులు వారి సమస్యలను వివరిస్తూ చికుమద్దుల వెలగ లక్ష్మీ రెండు సంవత్సరాలు పాప గెమ్మెలి ఆదిత్య బాబుకి మూడు నెలల నుండి స్టాకు ఇవ్వలేదని, కోర్రా కాంతము నాలుగు నెలలు బాలింతలకు స్టాక్ ఇవ్వలేదని, అలాగే కరేగరు మరి శాంతికి గుడ్లు, పాలు బాలల అమృతం,తదితర స్టాకులు ఇవ్వడం లేదని, చదువు లేకపోవడంతో పిల్లలకు సరిగా పాటలు బోధించడం లేదని స్టాకులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని వారు పేర్కొన్నారు, వారు తెలిపిన విషయాలన్నీ రిపోర్టులో రాసుకొని అంగన్వాడి టీచర్ పై చర్యలకు బాధ్యులని ఉన్న తాధికారులు తీసుకుంటారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎస్.భోజన్న దొర,సూపర్ సర్పంచ్ కొత్తన్న,మహిళలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు