కరీంనగర్ జిల్లా: వంతడుపుల గ్రామంలో ఈనెల 29న జరగబోయే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు , బహుజన రాజ్యాధికార సంకల్ప సభ కరపత్రాన్ని గన్నేరువరం మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ బామన్ల ప్రమీల,మానకొండూరు అసెంబ్లీ ఇంచార్జ్ ఏగోలపు వెంకన్న గౌడ్ లు ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్ నిషాని రాజమల్లు, గన్నేరువరం మండల అధ్యక్షులు బామండ్ల ఎల్లయ్య, గన్నేరువరం మండల కన్వీనర్ కళ్ళపెళ్లి భూమన్న,యాలాల తిరుపతి,ముఖ్య నాయకులు హరీష్ స్వేరో తదితరులు పాల్గొన్నారు.