ప్రజలకు ముందుగా తొలి ఏకాదశి పండుగ మరియు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినుకొండ కొండ పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా స్వామి కొండ పైకి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు, రేపు భక్తుల సౌకర్యార్థం ఆర్ టిసి బస్సు లకు కొండ పైకి నడిపే ప్రయత్నం లో నేడు టైల్ రన్ వేశామని, బస్సు సునాయాసంగా కొండ పైకి వెళ్లిందని తెలియజేశారు. బస్సు టైల్ రన్ విజయవంతం కావడం తో రేపు భక్తుల సౌకర్యార్థం భక్తులకు సరిపడా బస్సులను ఏర్పాటు చేయటం జరిగిందని, అంతేకాకుండా కొండ పై భక్తుల కోసం అన్నదానం వితరణ కార్యక్రమం, మజ్జిగ, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు తెలియజేశారు.