కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బుర్ర లావణ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని గురువారం బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించి 50 కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింది… ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షులు నగునూరి శంకర్, ప్రధాన కార్యదర్శి జాలి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు మునిగంటి సత్తయ్య, బుర్ర సత్యనారాయణ గౌడ్, రామచంద్రం ,మండల మీడియా కన్వీనర్ మచ్చ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు