పల్నాడు జిల్లా కారంపూడి : పేదరైతుల కోసం వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ కార్యక్రమన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రెండు ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వమే బోర్లు వేయించి రైతులకు లబ్ధిచేకూరుస్తుంది. కారంపూడి మండలానికి సంబంధించి జలకళ పథకం ద్వారా ఒప్పిచర్ల, భట్టువారిపల్లి, కారంపూడికి సంబంధించి 42 బోర్లు మంజూరు అయ్యాయి అందులో భట్టువారిపల్లి 10, ఒప్పిచర్ల 7, కారంపూడి 25 మంజూరు అయ్యాయి. ఈ పథకం కోసం చాలామంది పేదరైతులు దరఖాస్తు చేసుకున్నారు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక రైతు, అలాగే ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ లో కొరపాటి. సుధ అనే వైసీపీ అభిమాని మరికొందరు వైసీపీ అభిమానులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు వారు దరఖాస్తు చేసుకున్నప్పటికి వైసీపీ కి అనుబంధంగా ఉండే రైతులకు మంజూరు కాకపోగా ప్రభుత్వం మంజూరు చేసిన 42 బోర్లలో కారంపూడికి సంబంధించి మంజూరైన 25 బోర్లలో టీడీపీ అనుకూలంగా ఉన్న వారికే వైఎస్ఆర్ జలకళ పథకం మంజూరు అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ నాయకునిగా కొనసాగి ఇటీవల టీడీపీ పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా. లక్ష్మినారాయణ ముఖ్య అనుచరుడుడి కుటుంబానికి జలకళ పథకంలో రెండు బోర్లు మంజూరు అయ్యాయని మొదటినుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్న మాకు జలకళ పథకం మంజూరు కాలేదని ఎస్టి, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన రైతులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వైపు ఎమ్మెల్యే పిన్నెల్లి కి వ్యతిరేకంగా పనిచేసిన బీసీ సామాజికవర్గానికి చెందిన ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరికి రెండు బోర్లు మంజూరు కావటం విశేషం దీనితో జలకళ కోసం దరఖాస్తు చేసుకొని మంజూరు కాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు విలవిలలాడుతుంటే టీడీపీ సానుభూతిపరలైన కొందరు రైతులు జలకళ మంజూరై కళకళలాడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కారంపూడి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బంధుప్రీతి, స్నేహసంబంధాలు చూసుకొని నిజమైన పార్టీ వారికీ ప్రభుత్వ పథకాలు అందకుండా ఇతర పార్టీ వారికీ ప్రభుత్వ ఫలాలను అందిస్తూ స్వలాభం చేకూర్చుకుంటున్నారని కొందరు రైతులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. సొంతపార్టీ వారికీ కాకుండా ఇతర పార్టీ వారికీ ప్రభుత్వ ఫలాలు అందిస్తే పార్టీ నుంచి సొంతమనుషులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఇలాంటి విషయాలను నియోజకవర్గ పార్టీ అధిష్టానం గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.