contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మారం సందీప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మామిడి అక్షిత మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్ద కాలం అయినప్పటికీ 5300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ & స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాల ,,కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. లేని యెడల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి ,విద్యార్థి ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు బొప్పు శశి కుమార్, నగర కార్యదర్శి లకావత్ ఈశ్వర్, సాయి,అభినయ్, నవీన్, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :