శ్రీకాకుళం జిల్లా రాజాం : అధికారుల నిర్లక్ష్యమే చెరువుల్లో మట్టిని లూటీ చేస్తూ రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున వారి పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు సిహెచ్ ,రామ్మూర్తి నాయుడు రాజాం లో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో డిమాండ్ చేశారు రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా చెరువుల్లో మట్టిని తీసుకుపోయి ఇష్ట రాజ్యంగా దోచుకుంటూ చెరువుల కింద ఉన్న రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని, చెరువులు లోతైపోవడంతో మధుములు పైకి ఉండడంతో నీరు అందులో ఉన్నా కూడా రైతులకు ఉపయోగపడిన పరిస్థితి లేదని, మధుములను కానాలను ధ్వంసం చేస్తూ మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని, నిత్యం పత్రికల్లో వార్తలు వస్తున్నా అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదని, గ్రామాల్లో రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్న అధికారుల దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, మట్టి మాఫియాని అరికట్టవలసిన అధికారులే మా శాఖ కాదు మా శాఖ పరిధి కాదని బాధ్యతారహితంగా మాట్లాడుతూ బాధ్యతలు నిర్వహించకుండా మట్టి దోపిడీకి సహకరిస్తున్నారని ఈ విధానం సరైంది కాదని తక్షణమే వీళ్ళపై తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం అధికార యంత్రాంగం చర్యలకు సిద్ధపడకపోతే రైతాంగాన్ని కూడగట్టి దీనిపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు సిపిఎం పార్టీ నాయకులు శ్రీనివాసరావు ,సత్య రావు ,శంకర్రావు ,తిరుపతిరావు ,సురేష్ ,ఆదియ మొదలగువారు పాల్గొన్నారు