కరీంనగర్ జిల్లా: పట్టణంలోని మాస్క్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించు వన్డే యాక్టింగ్ వర్క్ షాప్ కు సంబంధించిన పోస్టర్ను జిల్లా అదనపు కలెక్టర్ జివి శ్యాం ప్రసాద్ లాల్ తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నటనపై ఆసక్తి ఉన్న పిల్లలకు పెద్దలకు నటనలో మెళుకువలు నేర్పిస్తూ టీవీ సీరియల్స్, షార్ట్ ఫిలింస్, సినిమాల్లో అవకాశాలు చూపిస్తున్నందుకు మాస్క్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ యాక్టింగ్ ట్రైనర్ అనసూరి భూనాథ చారిని అభినందించారు.ఆసక్తి ఉన్నవారు, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుందన్నారు.భూనాథాచారి మాట్లాడుతూ ఈ ఒక్కరోజు వర్క్ షాప్ లో కెమెరా ఫియర్ పోయేందుకు కొన్ని ఎక్సర్సైజులు, నవరసాలను, ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా నటనలో కొన్ని మెళుకువలు నేర్పించి,సర్టిఫికెట్లు అందజేస్తాం.అలాగే వారి వివరాలను దర్శకులకు అందజేయడం,అవకాశాలను తెలియపరచడం జరుగుతుందన్నాడు. పేరు రిజిస్ట్రేషన్ కు 8801565909 ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాస్క్ కోఆర్డినేటర్ వంగళ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కన్నూరి మహేష్, రావుల వేణు, వంగల సాయిరూప్ పాల్గొన్నారు.