- అల్లూరి జిల్లాలో కొనసాగుతున్న డోలి మోతలు
- అర్జీలు ఇచ్చిన పట్టించుకోని అధికారులు.
అల్లూరి జిల్లా,హుకుంపేట,ది రిపోర్టర్ :అల్లూరి జిల్లా,హుకుంపేట మండలం, గత్తుం పంచాయితీ పరిధిలో గల గాలిపాడు గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేక పేటేలి చెల్లమ్మ కు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే 2 కి.మీ డోలీ మోత మోసుకుంటూ గత్తుం లో తీసుకుని వచ్చి అంబులెన్స్ ఎక్కించి పాడేరు జిల్లా ఆసుపత్రికి పంపించడం జరిగింది.రోడ్డు కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టిన ఏ అధికార్లు,పాలకులు కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైన మా బాధలు అర్థం చేసుకుని మా గాలిపాడు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లూరి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ,పిఓ వారికి విజ్ఞప్తి చేశారు.