నిజామాబాద్ అర్ముర్ : ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఏ.డీ నాగ జ్యోతికి క్షత్రియ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ ఆర్మూర్ లోని క్షత్రియ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులతో వస్తుండగా వేల్పూర్ మండలంలో జాతీయ రహదారి పై 65 ” బస్ టైర్” బ్లాస్ట్ అయింది. ఈ ఘటన జరిగినప్పుడు పాఠశాల బస్సులో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారు. పాఠశాల బస్సుకి ఫిట్నెస్ ఉన్నది లేనిది విచారణ జరిపించి, ఫిట్నెస్ లేని యెడల పాటశాల గుర్తింపు రద్దు చెయ్యాలని, ఇలాగే పలు పాఠశాలలో కూడా బస్సులకు ఫిట్నెస్ లేదు. ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, ఫిట్నెస్ సర్టిఫికేట్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పొందుపరచని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, అలాగే ఫిట్నెస్ పొందిన పాటశాల లిస్ట్ బహిర్గతం చేయాలని ఒక వేళ టైర్ పలిగిన సందర్భంలో ప్రమాదం జరిగితే పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలని కోరారు . ఈ కార్యక్రమంలో మనోజ్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.