కరీంనగర్ జిల్లా: ప్రముఖ కళాకారుడు, తమ్ముడు సాయిచంద్ మృతి కళా రంగానికి తీరని లోటని గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారధి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి. రామకృష్ణా రావు తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రసమయి మాట్లాడుతూ 2001 నుండి తన పాటలో పాటయి ఆటలో ఆటయి తన వెన్నంటే వుంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న సాయి మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తన ఆట పాటలతో ప్రజలకు చేరవేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి సాయిచంద్ ప్రతిభను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మెన్ గా నియమించాడని, కానీ చిన్న వయస్సులోనే మరణించడం ఎంతో బాధాకరమన్నారు.అదేవిధంగా ములుగు జిల్లా పరిషత్ ఛైర్మెన్ కుసుమ జగదీష్ మృతి చెందడం బాధాకరమన్నారు. వీరిద్దరి కుటుంబాలను పార్టీ పరంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల ఒక నెల జీతాన్ని మొత్తంగా రూ.3 కోట్ల రూపాయలు జమ చేసి సాయి చంద్ మరియు జగదీష్ కుటుంబాలకు కోటి యాభై లక్షల చొప్పున వారికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుందన్నారు.సాయి చంద్ సతీమణి రజినీకి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలిపారు. వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటూ బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు. వారు పార్టీకి చేసిన సేవలను మరువ బోమని అదే విధంగా బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా పార్టీ సర్వదా అండగా ఉంటుందని ఎమ్మెల్యే రసమయి స్పష్టం చేశారు..