- సమస్యలు పరిష్కారానికి వైసీపీ సర్కార్ మొండిసేయ
- బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
- అరెస్టులతో ఉద్యమం ఆపలేరు
అల్లూరి జిల్లా హుకుంపేట: గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని 16 రకాల గిరిజన సంక్షేమ పథకాలను అమలు చేయాలని
ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్ను దొర అన్నారు.శుక్రవారం చలో విజయవాడ గిరిజన కమిషనర్ ఆఫిస్ కార్యక్రమంలో శుక్రవారం రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలపై రాష్ట్ర ఎస్టీ సెల్ అద్వర్యంలో రాష్ట్ర గిరిజన కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేసెందుకు వెళ్లిన రాష్ట్ర గిరిజన నాయకులను పోలీసులు
అడ్డుకోవడం సరికాదన్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్ను దొర మాట్లాడుతూ అరెస్టుల ఉద్యమం ద్వారా ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉన్నా సమస్యలు పరిష్కరనికి నోచుకోలేక ఉన్నాయి అని ఆయన అన్నారు. పళ్ళు సమస్యలు పరిష్కరించాలని విన్నవించిన విన్నవించడానికి వెళ్లిన నాయకులకు అరెస్టు చేయడం అడ్డుకోవడం సరికాదన్న ఆయన హెచ్చరించారు. పోలీసులు అనుమతించక అడ్డుకోవడంతో కొంత ఉత్కంఠం నెలకొంది. కొంతసేపు గిరిజన నాయకులకు పోలీసులకు తోపులాట జరిగిందని అన్నారు. ధర్నాకు దిగిన నాయకులకు పోలీసుల జులుం నాశించాలని,సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదంతో సుమారు 2 గంటల పాటు కమిషనర్ ఆఫిస్ ఎదుట ధర్నాకు దిగడం జరిగిందన్నారు. ధర్నాకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎస్ టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్ను దొర, మాజీ ట్రైకర్ చైర్మన్ ధారునాయక్, మాజీ ఎస్ సి, ఎస్టీ కమిషన్ సభ్యులు నరహరి ప్రసాద్ మరియు రాష్ట్ర గిరిజన నాయకులను అరెస్ట్ చేయడం జరిగిందినీ ఆయన తెలిపారు