అల్లూరి జిల్లా, రాజవొమ్మంగి,ది రిపోర్టర్ : రాజవొమ్మంగి మండలం,అప్పటి తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలం, బడదానంపల్లి పంచాయతీ పరిధిలోని లక్కవరప్పాడు గ్రామ సమీపంలో ఈ మధ్య కాలంలో రూ.పది లక్షల గ్రాంట్ తో చిన్న కల్వర్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం చేసిన కల్వర్టు నాణ్యత లేదని స్థానిక ప్రజల ద్వారా తెలుసుకోవడం జరిగింది. కల్వర్టు నిర్మాణం ప్రారంభంలోనే శిధిలావస్థలకు చేరుకునే పరిస్థితి ఉందని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అన్నారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ….వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా చూసినా ఇటువంటి అవినీతి పనులు, నిర్లక్ష్యం జరుగుతునే ఉన్నాయన్నారు. వైసిపి ప్రభుత్వ పనితీరుని, ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తే, రౌడీయిజం,బెదిరింపులు జరుగుతున్నాయన్నారు. వైసిపి ప్రభుత్వంలో గ్రామాల ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. మామూలుగానే, రంపచోడవరం నియోజకవర్గం నిర్లక్ష్యానికి, కమీషన్లకు, అవినీతికి పెట్టిన మారుపేరు. కానీ రహదారులు, ప్రభుత్వ భవనాలు నాణ్యత ఎక్కడా కనిపించదు. రాజకీయ నాయకులు, అధికారులు కాసులకు కక్కుర్తిపడి ప్రజల సంక్షేమం,అభివృద్ధి మర్చిపోతున్నారు. ఎవరైనా పరిశీలిస్తే, లేదా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తే, రంపచోడవరం నియోజకవర్గం భాగోతం ఇట్టే, తెలిసిపోతుందని అర్జున్ రెడ్డి తెలిపారు. అయితే పది లక్షల రూపాయల గ్రాంట్ తో నిర్మాణం చేసిన వంతెన నాణ్యత లోపానికి కారకులైన వారిపై ఇటువంటి అవినీతి జరగకుండా ఉండాలంటే, ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు.