- స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ పథకంలో భాగంగా వివిధ పనుల పరిశీలన
కరీంనగర్ జిల్లా, ది రిపోర్టర్ టీవీ : గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామాన్ని మంగళవారం కలెక్టర్ ఆర్.వి కర్ణన్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత పారిశుద్ధ్య పనులు మరుగుదొడ్ల నిర్వహణ ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మాణం తడి పొడి చెత్త సేకరణ కాంపోస్టు షెడ్యూల్ పరిశీలించారు. వారసంతలు ఉన్న మరుగుదొడ్లపై పురుషులు స్త్రీల ఫోటోలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న బోర్ పంపును తొలగించాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలు సంబంధించిన కొమ్మలను కత్తిరించాలని తెలిపారు. మంచినీటి ట్యాంకులు డ్రైనేజీ నిర్మాణాలను తనిఖీ చేశారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రజలకు వాడకం లేని వస్తువులను గుర్తించి తొలగించాలన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ పథకంలో కేంద్ర బృందం పర్యటిస్తుందని ఈ లోగా లోపాలను గుర్తించి సరి చేయాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను అభినందించారు. రైతులు ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై తెలుసుకున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించగా ఆరు బస్తాలు పైన ధాన్యానికి డబ్బులు తక్కువ వచ్చాయని గంప మహేష్ అనే యువకుడు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాడు. రెవెన్యూ పరమైన సమస్యలపై అలసత్వం చేయకుండా రిజిస్ట్రేషన్ లపై జాగ్రత్తగా వివరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్, జెడ్పి సీఈఓ ప్రియాంక, డిఆర్డిఏ శ్రీలత, డిపిఓ వీర బుచ్చయ్య, సర్పంచ్ గంప మల్లీశ్వరి, తహసిల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీవో స్వాతి, ఎంపిఓ పీవీ నరసింహారెడ్డి, ఏపిఎం లావణ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, ఉపసర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, వేణు, రమేష్, ఏఈఓ అనూష పాల్గొన్నారు.