- పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఒప్పిచర్ల వాలంటీర్స్
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామ మెయిన్ సెంటర్ నందు ధర్నా నిర్వహించారు సచివాలయ వాలంటీర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాపై అనుచిత వాక్యలు చేసిన పవన్ కళ్యాణ్ వెంటనే వాలంటీర్లు అందరికీ క్షమాపణ చెప్పాలని ఒప్పిచర్ల సచివాలయం 1&2 వాలంటీర్లు మండిపడ్డారు లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లంతా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు.పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేస్తున్న మాపై తప్పుడు కూతలు కూయడం సరికాదని హెచ్చరించారు మేము 5వేల రూపాయలు గౌరవ వేతనంతో ఇంటింటికి బంధువుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా నిస్వార్ధంగా పనిచేస్తున్న మామీద పవన్ కళ్యాణ్ అసభ్యకర మాటలతో వ్యాఖ్యానం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మాపై చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. మేము కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నామని అన్నారు. ఎవరైనా భయపెట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ భయపడేది లేదు అన్నారు జగనన్న ప్రవేశ పెట్టిన నవరత్నాలు ప్రతి ఒక్కరికి చేరుస్తూ మంచి పనితో ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలని అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇరిగిదెండ్ల రమణ కొండలు, ఇరిగిదెండ్ల లాజర్, ఎంపీటీసీ శ్రీను, పంగులూరి అంజయ్య, కాటా శ్రీను, వున్నం హరిబాబు, పంగులూరి ఆదినారాయణ, కారంపూడి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కో కన్వీనర్ పిన్నెల్లి శ్రీను, నర్రా వెంకట్రావు, జి.ఏలీషా, పేతురు, ఇ.గురవయ్య, గ్రామ సచివాలయం 1&2 వాలంటీర్స్ మరియు వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.