చట్టం నిర్దేశించిన నిబంధనలు అనుసరించకుండా జర్నలిస్టు ఫోన్ను సీజ్ చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు పేర్కొంది. ఏదైనా కేసులో జర్నలిస్టుల ఫోన్ అవసరమని భావిస్తే, సీఆర్పీసీ నిబంధనలను అనుసరించాలని స్పష్టం చేసింది. తప్పుడు వార్తలతో తన పరువు తీశాడని MLA శ్రీనిజిన్.. యూట్యూబ్ న్యూస్ ఛానెల్ నిర్వాహకుడు షాజన్ స్కారియాపై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.