- 20,000/- రూపాయిలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన విశాఖపట్నం జిల్లా, ప్రశాంతినగర్ సచివాలయ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్
విశాఖపట్నం జిల్లా, అగనంపుడి గ్రామానికి చెందిన ఫిర్యాదిదారుడు మరియు బంధువుల ఇంటి పన్ను దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి రూ. 20,000/- రూపాయిలు లంచంగా విశాఖపట్నం జిల్లా, ప్రశాంతినగర్ సచివాలయ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ శ్రీ D. భాస్కరరావు బాధితుడిని డిమాండ్ చేయడంతో, ఫిర్యాదిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దీనిపైన కేసు నమోదు చేసుకున్న అధికారులు ఈ రోజు విశాఖపట్నం జిల్లా, ప్రశాంతినగర్ సచివాలయ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ శ్రీ D. భాస్కరరావు బాధితుడిని వద్ద నుండి 20,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా విశాఖపట్నం రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. మరి కాసేపటిలో నిందిత ఆధికారిని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తారు.
అవినీతి అధికారులపై ప్రజల ఫిర్యాదు కోసం 14400: అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించ వచ్చని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు.