మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గ్రామ పంచాయితీ సిబ్బంది చేస్తున్న సమ్మె తొమ్మిదవ రోజుకు చేరుకుంది.
పలు డిమాండ్ల తో మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా నిరవధిక సమ్మె లో భాగంగా కాంగ్రెస్ నాయకులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు రామిల్ల రాధిక మాట్లాడుతూ..గ్రామ పంచాయితీ సిబ్బందిని పర్మినెంట్ చేసి, 11వ పి.ఆర్.సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ రూ. 19,000/- లు వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆలోపు. జి.వో నెం.60 ప్రకారం స్లీపర్లకు రూ. 15,600/-, పంపు ఆపరేటర్లకు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ 19.500/-లు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి మరణించిన కార్మికుని కుటుంబానికి రూ 10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు.బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయితీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేసి, జి.ఓ. నెం 51ను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారాలు, పండుగ సెలవులు, జాతీయ ఆర్జిత సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకురాలు రామిల్ల రాధిక, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం జేఏసీ ప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.