కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ – గన్నేరువరం మండలాల శివారులోని రేణికుంట టోల్ గేట్ యాజమాన్యం వైఖరి ని నిరసిస్తూ ఆదివారం నియోజకవర్గ స్థాయి బిజెపి నాయకులు, కార్యకర్తలు రాస్తారోఖో నిర్వహించారు. రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కరివేద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం వేలాదిగా నడిచే వాహనాలతో రద్దీగా ఉండేటువంటి టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నదని ఆరోపించారు. రాజీవ్ రహదారి పై డివైడర్ ల దగ్గర సిగ్నల్ లైట్ లు పనిచేయడం లేదని ఈ సమస్యపై టోల్ గేట్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత రెండురోజుల క్రితం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డు ను సమాచారం లేకుండా అర్థరాత్రి తొలగించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ మాట్లాడుతూ బిజెపి పార్టీ కి సంబందించిన వాల్ రైటింగ్ లను తొలగిస్తూ మిగతా పార్టీ ల వాల్ రైటింగ్ ల తొలగించకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ కి తొత్తులుగా పనిచేయడం సమంజసం కాదని సూచించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, తిమ్మాపూర్,గన్నేరువరం, బెజ్జంకి,శంకరపట్నం మండలాల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, నగునూరి శంకర్,దోనే అశోక్, ఎనుగుల అనిల్, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొలిపాక రాజు, బిజెవైఎం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వరుణ్, జిల్లా నాయకులు తమ్మిశెట్టి మల్లయ్య, మావురపు సంపత్, బూట్ల శ్రీనివాస్, జంగ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.