కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండల పోలీస్ స్టేషన్ కు తరలించిన కాంగ్రెస్ నాయకులను విడుదల చేపించి గన్నేరువరంలో విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు.
అమెరికాలో అంట్లు తోముకొని బతికిన కేటిఆర్ కి రాహుల్ గాంధీని విమర్శించే హక్కు లేదు అన్నారు. మంగళవారం డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గన్నేరువరం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ది చేప్తారని రైతుల ధాన్యాన్ని అమ్ముకుంటే ప్రభుత్వం క్వింటలుకు మూడు నుండి నాలుగు కిలోలు కట్ చేసి రైతులను దోచుకుంటుంటే ఏ బిఆర్ఎస్ నాయకుడు కూడా రైతుల పక్షనా లేడని ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీటింగ్లు పెట్టడం సిగ్గు చేటన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇచ్చి రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని అన్నారు. నిజంగా ఈనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి ఉంటే సబ్ స్టేషన్లో నుండి లాగ్ బుక్కులు తీసుకెళ్లవలిసిన ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు రుణమాఫీ చేయడం ఉచిత విధ్యుత్,సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం సబ్సిడీపై విత్తనాలు అందించడం జరిగింది అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయకుండా పంట నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందించకుండా తరుగు పేరుతో క్వింటలుకు నాలుగు కిలోలు దోచుకున్న బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించాలని గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్,జిల్లా నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బొడ్డు సునీల్, బద్దం సంపత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నియోజవర్గ ప్రధాన కార్యదర్శి గంప మహేష్,పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షుడు మార్గం మల్లేశం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, సీనియర్ నాయకులు కటకం తిరుపతి,బుర్ర అంజయ్య గౌడ్, మైసంపల్లి తిరుపతి, కూన డాక్టర్ నర్సయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.