కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: నాడు కష్టాలు కన్నీళ్లు కరువులతో అల్లాడిన తెలంగాణ, నేడు ముఖ్య మంత్రి కేసీఆర్ పాలనలో పచ్చని పంటలు, చిరు నవ్వులతో రాష్ట్రం కళకళ లాడుతుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ సంతోషం వ్యక్తం చేశారు. మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన వర్షంలో సైతం గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేశారు.ముందుగా గ్రామపంచాయితీ కార్యాలయం, శాలివాహన సంఘ నూతన భవనాలను ప్రారభించి, అనంతరం రూ.50 లక్షల నిధులతో మహిళా సంఘం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాల సంఘం, మైనార్టీ సంఘం నూతన భవనాలతో పాటు అంబేద్కర్ సంఘం భవన ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా రసమయి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలిచాయాన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సుసాధ్యం చేసి చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక నమూనాగా నిలబెట్టిన ఘనత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. చైతన్యం తొణికిసలాడే గడ్డ మానకొండూర్ గడ్డ అని ప్రజల సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న పార్టీని సమాజం ఎన్నడూ వదులుకోదన్నారు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదని తెలంగాణ ప్రజలతో బీఆర్‌ఎస్ పార్టీది పేగుబంధమని పురిటిగడ్డ పైన గులాబీ పార్టీ ముచ్చటగా మూడవ సారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం అన్నారు.నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేస్తున్న తనపై పనికి మాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే రసమయి మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు మరియు బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. తమ అభిమాన నాయకుడు, గ్రామ అభివృద్ధి ప్రధాత అయినా రసమయి వర్షంలో సైతం తడుస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల మన్నెంపల్లి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయనకు తోడుగా భాగస్వాములై, తమ అభిమానాన్ని చాటుకున్నారు.