కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జెయింట్ సెక్రటరీగా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లె గ్రామానికి చెందిన అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గురువారం నియామకం అయ్యారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తన నియమాకానికి సహకరించిన కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణకు.మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.జాతీయ,రాష్ట్ర,నేతలకు,యువ నేతలకు,జిల్లా నేతలకు,కృతజ్ఞతలు తెలిపారు. గన్నేరువరం మండల కాంగ్రెస్ నాయకులు, పలువురు నేతలు నాయకులు, అభిమానులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
