హైదరాబాద్, మధురానగర్ : మధురానగర్ లో మహిళపై కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్షం లో తడిచి నానిపోతారని రోడ్డు పై వెళుతున్న మహిళను నమ్మబలికి డ్రైవర్ కారు ఎక్కించుకున్నారు. ఎవరూలేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, అనంతరం కారునుండి బెయటికి తోసేసాడు. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించి, నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
