గుంటూరు జిల్లా : కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యను హత్య చేసిన సంఘటన పొన్నూరు పట్టణం నిడుబ్రోలు ప్రాంతంలో సంచలనం రేపింది. పొన్నూరు మున్సిపల్ పరిధిలోని నిడుబ్రోలు పదో వార్డుకు చెందిన గుర్రపు శాల నవీన్ రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతనికి ఎనిమిదేళ్ల క్రితం చిలకలూరిపేట కు చెందిన షేక్ సల్మాతో ప్రేమ వివాహమైంది. వీరికి నేహా ప్రసన్న కుమార్తె కలదు. వీరిద్దరి మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రతిరోజు ఇంటికి వచ్చి నవీన్ తన భార్య సల్మా ను చితక బాదే వాడు. శుక్రవారం సాయంత్రం కూడా తప్ప తాగి ఇంటికి వచ్చిన నవీన్ తన భార్య సల్మా ను దిండుతో అదిమిపెట్టి చంపాడు. క్లూస్ టీం మృతికి గల కారణాలను సేకరిస్తున్నారు. పొన్నూరు పట్టణ సీఐ బాబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.