- సినీ నటుడు సూర్య జన్మదినం సందర్భంగా బ్యానర్ కడుతున్న ముగ్గురు యువకులు కు కరెంట్ షాక్ తగిలింది.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్ప కొండ , యక్కాల వారి పాలెం గ్రామం లో ఆదివారం తెల్లవారు జామున విషాదం చోటుచేసుకుంది. సినీ నటుడు సూర్య జన్మదినం సందర్భంగా బ్యానర్ కడుతున్న ముగ్గురు యువకులు కు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో నక్క వెంకటేష్ (19), పోలూరి సాయి (20) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒకరికి గాయాలు అయ్యాయి. మృతి చెందిన యువకులు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు.