మంచిర్యాల జిల్లా చెన్నూరు: మణిపూర్ లో జరిగిన సంఘటనకు నిరసనగా ఆదివాసి సంఘాల నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి మెమోరాండం సమర్పించారు, దీన్ని ఉద్దేశించి ఆదివాసి నాయకులు గంజి రాజన్న కురుసంగి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,భారతదేశంలో కనీ విని ఎరుగని రీతిగా ఇద్దరూ అమ్మాయి లను వివస్త్రాలు చేసి,ఊరంతా ఊరేగించి బలవంతం చేయడం అమానుషమని, ఇది ఆదివాసులపై చేస్తున్న దౌర్జన్యం అని ,కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలనలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పాలన వ్యవస్థ, ఆదివాసులపై దౌర్జన్యానికి పాల్పడి, మూడు నెలలుగా జరుగుతున్న గొడవల్లో 100 మందికి పైగా చనిపోయిన గాని పట్టించుకోక నిర్లక్ష్య ధోరణి వైఖరిని చూపిస్తుందని, ఆదివాసులపై అగ్రవర్ణాలు పెత్తందారుల క్రింద నలిగివేసారి పోతున్న, ఆదివాసులకు ప్రత్యేకమైన చట్టాలు తేవడం లేదని ,మే 4న ఇద్దరూ మహిళలను వివస్త్రాలుగా చేసి ఊరేగించడం దారుణమైన సంఘటన అని భరతమాత సైతం సిగ్గు తో తలదించుకునే పరిస్థితి అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిందని ,ఇక ఈ ప్రభుత్వాలలో మహిళలకు దళితులకు ఆదివాసీలకు భద్రత లేకుండా పోయిందని, ఇంత ఘోరమైన సంఘటన భారతదేశంలో ఖండించడానికి ఒక్క పార్టీ నాయకులు కూడా రాకపోవడం, ఖండించకపోవడం సిగ్గుచేటు అని ,వెంటనే ప్రజానీకం అంత స్పందించి ,వివస్త్రాలుగా చేసిన మహిళలకు న్యాయం చేకూరేలా, నిందితులను బహిరంగంగా ఉరితీయాలని మళ్ళీ ఇటువంటి సంఘటనలు భారతదేశంలో ఎక్కడ కలగ కుండా, ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టి శిక్షించాలని ,ఆదివాసి నాయకులు కోరారు నిందితులను శిక్షించకపోయినట్టయితే, దేశంలో ఉన్న ఆదివాసి కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు చేపట్టి, రాస్తారోకోలు చేసి ,న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియపరిచారు, ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.