- గుంతలమయంతో అధ్వనంగా రోడ్డు
- రోడ్డు పై రాస్తారోకో చేసి వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బిజెపి నాయకులు
కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ : మానకొండూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీ వద్ద మానకొండూర్ నుండి వేగురుపల్లి వరకు రోడ్డు నిర్మాణపనుల జాప్యాన్ని నిరసిస్తూ…. ఈరోజు బిజెపి మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో చేసి వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు మరియు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, మండల ఇన్చార్జి మాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ. మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఏళ్ల తరబడి మానకొండూర్ నుండి వేగురుపల్లి వరకు రోడ్డు నిర్మాణాలు పనులు చేపట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాలని అన్నారు. అన్నారం రోడ్డు నిర్మాణ పనులు గత నాలుగేళ్లుగా పూర్తికాకపోవడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి చిత్తశుద్ధి చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్షణాచారి,మండల ఉపాధ్యక్షులు వుషకోయిల రమేష్, ఎస్సీ మోర్చ మండల అధ్యక్షులు ఆరెల్లి శ్రీహరి, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, ప్రధాన కార్యదర్శులు ఎదులాపురం ఆశ్వన్ తేజ, పూసల సాయికుమార్,రుద్రోజు గణేష్, తాడూరి కిరణ్ రెడ్డి, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు కొండ్ర వరప్రసాద్, మడ్డి రాకేష్, నాయకులు: దండు కొమురయ్య, మందాడి జగ్గారెడ్డి, కంతాల రాజిరెడ్డి, నూనె కొండాల్ రెడ్డి, కాల్వ సాయి, రేణిగుంట సాగర్, సంపత్ పాల్గొన్నారు.