- నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చెయాలి. సర్పంచ్ కె. మోస్య.
అల్లూరి జిల్లా: అనంతగిరి ది రిపోర్టర్ : మండలంలోని టోకూరు పంచాయతీ బలియగుడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో నాడు నేడు పనులు పూర్తి చెయాలనీ స్థానిక సర్పంచ్ కిల్లో మోస్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సర్పంచ్ కిల్లో మోస్య సీపీఎం నాయకులు గెమ్మెల దేవన్న గెమ్మెల భీమరాజు స్కూల్ చైర్మన్ లక్ష్మణరావు లతో కలిసి పాఠశాల తనిఖీ చేశారు. నాడు నేడు పనులు పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయురాలు గుజ్జెల సుజాత ని సమస్యల పై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల బ్యాంక్ ఖాతా లో మొత్తం రూ. 3,47,108 జమ అయింది, ఇప్పటికే గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు రూ.1,67,894 ఖర్చు చేసినప్పటికీ పనులు అస్తవ్యస్తంగా ఉంది రూప్ సీలింగ్ చెయ్యకుండా వదిలేయడం వలన భవనం మొత్తం కారిపోతుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నాడు నేడు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు గెమ్మెల దేవన్న గెమ్మెల భీమరాజు స్కూల్ చైర్మన్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
జడ్పిటిసి ఆధ్వర్యంలో పాడేరు ఐటిడిఏ పిఓ కు ఫిర్యాదు.
టోకూరు బలియగుడ పాఠశాల నాడు నేడు పనులు పూర్తి చెయ్యకుండా డబ్బులు డ్రా చేసిన ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలని వెంటనే పనులు పూర్తి చేయాలని పాడేరు ఐటిడిఎ పిఓ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు, సీపీఎం నాయకులు గెమ్మెల దేవన్న ,నరాజీ సురేష్ ఉన్నారు.