అల్లూరి జిల్లా, అనంతగిరి, ది రిపోర్టర్ : అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం,రొంపిల్లి పంచాయితీ పరిధిలో గల బూరిగ గ్రామం సోముల పెంటయ్య గిరిజన రైతుకు సంబందించిన సర్వే నెంబర్ 4-3 లో ఐదు ఎకరాల జిరాయితి భూములలో గ్రామంలో 30 మంది యువకులు కలిసి కొర్ర విత్తనాలు జల్లి పలుగు,పారా పట్టుకొని కొండను తవ్వుతూ
పాటలు..పాడుతూ పోడు వ్యవసాయం సాగిస్తున్నారు. అనంతగిరి మండల రెవెన్యూ అధికారులు,రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కలిపి గిరిజనులు పేర్ల మీద సాగులో ఉన్న భూములను గిరిజనులకు సమాచారం ఇవ్వకుండా స్థానికేతరులు,గిరిజనేతరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పేర్ల మీద నేటికీ వెబ్ ల్యాండ్ రికార్డులు కొనసాగిస్తున్నారు.
వాస్తవానికి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మా పోడు వ్యవసాయాన్ని చూశారు సరే…సాగు హక్కు కల్పించాలని వార్డు సభ్యుడు సోమల అప్పలరాజు,సోములు వీరయ్య, గ్రామస్తులందరూ సమిష్టింగా డిమాండ్ చేస్తూ పాటలు పాడుతూ పోడు వ్యవసాయం సాగు చేస్తున్నారు.