- అడుగంటుకు పోతున్న భూగర్భ జలాలు.
- పాత్రికేయుల పేరుతో అక్రమ బోరుబావి తవ్వకాలు,
- ముడుపుల ముసుగులో పంచాయతీ,రెవెన్యూ అధికారులు.
అల్లూరి జిల్లా, అరకువేలి,(ది రిపోర్టర్ ) :ప్రముఖ పర్యాటక కేంద్రం అందాల ఆంధ్ర ఊటీ అరకులోయ మండల కేంద్రంలో వాల్టా చట్టానికి వ్యతిరేకంగా అనధికారికంగా, అనుమతులు లేని బోరు బావి,బోరింగు పంపులు విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ ఇష్టనుసారంగా వాల్ట చట్టానికి విరుద్ధంగా బోరింగ్ బావి తవ్వుకుంటున్నారని స్థానిక గిరిజనులు మండిపడుతున్నారు, ఇలాంటి తవ్వకాల వల్ల వేసవికాలంలో భూ గర్భ జలాలు ఆడుగంటుకు పోతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు, హెర్మూన్ చర్చి సమీపంలో ఆంధ్రప్రభ గంగు నాయుడు నివాస గృహం సమీపంలో వీధి రహదారికి అనుకుని స్టిక్కరింగ్ అప్పారావు అనే గిరిజననేతరుడు పాత్రికేయాల ముసుగులో మీడియా పేరు చెప్పి అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా అక్రమ బోరుబావి విచ్చలవిడిగా తవ్వుకుంటున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పంచాయితీ అనుమతులు లేకుండా అధికారులకు తెలియకుండా బోరింగ్ పంపు ఏ విధంగా తవ్వకాలు జరిపారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు,పంచాయతీ అధికారులకు వాల్టా చట్టం గూర్చి తెలియదా అంటూ స్థానికులు మండిపడుతున్నారు, బోరింగ్ తవ్వకాల పై పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పుడు స్థలం పరిశీలించకుండా బోరుబావి తవ్వుకోవడానికి చలన ఏ విధంగా స్వీకరిస్తున్నారో చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు,వాల్టా చట్టానికి ధిక్కరిస్తూ చట్టానికి వ్యతిరేకంగా బోరు బావి ఏ విధంగా తవ్వకాలు జరుపుతున్నారని పంచాయతీ అధికారులు సమాధానం చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు, పంచాయితీ అధికారులు మౌనం విడాలని, మౌనం వెనక అంతర్యం ఏమిటోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అక్రమంగా బోరు బావి తవ్విన విషయం పంచాయతీ అధికారులకు తెలియదా ? లేక పంచాయితీ అధికారులు ముడుపులు తీసుకొని అక్రమ బోర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలుకూడా వినిపిస్తున్నాట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు,అక్రమంగా అనాధికార బోరు బావి తవ్వకం పై పంచాయితీ అధికారులు విచారణ జరిపి అనధికార అక్రమ బోరు బావి తవ్వకాదారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.