సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండల నూతన ఎస్సైగా జి.నరేందర్ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు, కోహెడ మండల నుంచి బదిలీపై వచ్చారు. గతంలో బెజ్జంకి ఎస్ఐ ప్రవీణ్ రాజ్ సీఐ గా ప్రమోషన్ పై బదిలీ వెళ్లారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. కాగా ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పత్రికా మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
