కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ : చలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో తెలంగాణ విద్యార్థి కదన భేరి
బహిరంగ సభ కు సోమవారం గన్నేరువరం మండలకేంద్రం నుండి భారీ ఎత్తున విద్యార్థులు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్త హరికాంతం అనిల్ రెడ్డి మాట్లాడుతు మా నీళ్లు, నిధులు, నియామకాలకోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల కేసీఆర్ పాలనలో మోసపోయి, గోసపడుతున్నది. అరకొర వసతులు, అధ్వాన్న స్థితిలో ప్రభుత్వ పాఠశాలలు ఆగమైపోతున్నవి. కార్పొరేట్’ శక్తులు బ్రాండ్ పేరుతో మాఫియాగా మారి అధిక ఫీజుల దోపిడీ, ఒత్తిళ్లతో విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్స్ పెరగక, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సాంఘీక సంక్షేమ హాస్టల్స్ పూర్తిగా సంక్షోభంలోకి నెట్టి వేయబడ్డాయి. తెలంగాణ ఉద్యమ జ్వాలను రగిల్చిన విశ్వవిద్యాలయాలు నిధులు లేక, నియామకాలు చేపట్టక నిర్వీర్యమైనాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు నిరాశ నిస్పృహలతో గోస పడుతుంటే, లీకేజీలు, ప్యాకేజీలతో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తుంది. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి, కుటుంబ పాలనతో అప్పులపాలు చేసిన ఈ దగాకోరు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం! పెండింగ్లో ఉన్న ఐదు వేల మూడు వందల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ప్రతి విద్యార్థికి షరతులు లేకుండా మొత్తం ఫీజును రీయింబర్స్మెంట్ చేయాలి. పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లను రూ.3,500/- లకు పెంచి ప్రతినెల విద్యార్థి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. ఫీజుల నియంత్రణ చట్టం చేసి, అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి. విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను నిషేధించాలి.సాంఘీక సంక్షేమ, గురుకుల వసతి గృహాలకు పక్కా భవనాలను నిర్మించి, మెరుగైన వసతులు కల్పించాలి.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలి. టి.ఎస్.పి.ఎస్.సి ని ప్రక్షాళన చేస్తూ పటిష్టపరిచి, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మూసివేసిన 8,624 ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలి. ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వ యూనివర్సిటీలలో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి. కబ్జాలకు గురవుతున్న యూనివర్సిటీల, ఎయిడెడ్, ప్రభుత్వ విద్యాసంస్థల భూములను పరిరక్షించాలి. రాష్ట్రంలో జాతీయ (ఎన్ఈపి)-2020) అమలు చేయాలి.విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి. అని ఆన్నారు. ఈ కార్యక్రమంలో కూన మహేష్, సిరిగిరి అంజి, మఠం రాజు, సిరిగిరి భాస్కర్, దేశరాజు అనిల్,బత్తిని ప్రసాద్,కురపటి అంజి,పత్రి శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
