సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు బుధవారం పాఠశాల స్థాయి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికలలో విద్యార్థులు చురుగ్గా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని స్కూల్ కెప్టెన్ గా 2023-24 సంవత్సరానికి గాను ఎగోళం నిహారిక, వైస్ కెప్టెన్ గా బొడిగె రచనను బ్యాలెట్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జనగాం శంకర్ పర్యవేక్షించారు. గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల రమేష్ శుభాకాంక్షలు తెలుపుతూ, పాఠశాల స్థాయిలో ఎన్నికలు అనేటివి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవడానికి ఎంతో తోడ్పడుతుందని, ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావడానికి పౌరులు తము నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలతో పాటు తమ హక్కులను తెలుసుకుంటారని, ఓటు హక్కు అనేది హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుని బాధ్యత అని విద్యార్థులు గ్రహిస్తారని తద్వారా భవిష్యత్తులో ప్రజాస్వామ్య విలువలను గ్రహించి ప్రజాస్వామ్య విజయవంతానికి అవసరమైన తమ వంతు పాత్ర పోషిస్తూ ఉత్తమ పౌరులుగా తయారు కాబడి నవ సమాజ నిర్మాణానికి భవిష్యత్తులో కృషి చేస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎన్. శ్రీనివాస్, పి.ప్రభాకర్, ఎస్ మనోహర్ రెడ్డి, హెచ్ శ్రీనివాస్, పి రాజు, పి యాదగిరి, జె. శ్రీనివాస్, జి పరమేశ్వర్ రెడ్డి, వి సతీష్ కుమార్, ఎండి కలిమ్మొద్దిన్, జి పద్మావతి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బేగంపేట సర్పంచ్చింతలపల్లి సంజీవరెడ్డి, ఎంపీటీసీ పోతు రెడ్డి స్రవంతి మధుసూదన్ రెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జనగాం శంకర్ శుభాకాంక్షలు తెలిపారు.
