అల్లూరి సీతారామరాజు జిల్లా, సీలేరు : విద్యుత్తు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కొరకు సమ్మె బాట పట్టనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి రీలే దీక్షలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సీలేరు, డొంకరాయి, మోతుగూడెం లలో విద్యుత్తు ఉద్యోగులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా యాజమాన్యం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.
ఈ సం దర్భంగా విద్యుత్యు ఉద్యోగుల ఐకాస నాయకులు మాట్లాడుతూ ఎపి జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిస్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు, ఆగష్టు 10 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు యాజమాన్యం పరిష్కరించకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించే వాతావరణం కనబడలేదని మండిపడ్డారు. వేతన సవరణ గడువు ముగిసి 16 నెలలు దాటినా ఇప్పటివరకు కొత్త వేతన సవరణ ప్రకటించలేదని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగులకు 45 శాతం ఫిట్మెంట్తో పిఆర్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు.