కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, మానకొండూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం విలేకరుల సమావేశం లో మాట్లాడారు ఈ నెల 4 వ తేదీన శుక్రవారం గన్నేరువరం మండల బంద్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు,యువజన సంఘాలకు, మండల ప్రజలకు పిలుపునిచ్చారు, ఇటీవల వర్షాలతో రోడ్లు దెబ్బతిని అధ్వానంగా మారాయి అని అన్నారు. గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనిని వెంటనే నిర్మించాలని, గన్నేరువరం నుండి మైలారం రోడ్డును నిర్మించాలని,పారువెళ్ల నుండి గన్నేరువరం మధ్యలో హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి. గన్నేరువరం నుండి చొక్కారావుపల్లె మధ్యలో హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని. జంగపెళ్లి, హన్మజీపల్లె మధ్యలో హై లెవల్ బ్రిడ్జిని నిర్మించాలని. గుండ్లపల్లి నుండి గునుకుల కొండాపూర్ మధ్యలో కల్వర్టును నిర్మించాలని. గన్నేరువరం నుండి యాస్వాడ వరకు తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అన్నారు..ఈ కార్యక్రమానికి అఖిలపక్షం నాయకులు వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా నాయకులు సంపతి ఉదయ్ కుమార్,సిపిఐ (ఎంఎల్) బామండ్ల రవీందర్, గొల్ల కురుమ యాదవ సంఘం మండల అధ్యక్షుడు సందవేణి ప్రశాంత్, గన్నేరువరం శ్రీ ఆంజనేయ ఆటో యూనియన్ అధ్యక్షుడు ముడికే శ్రీనివాస్, శుక్రవారం 4వ తేదీన జరిగే కాంగ్రెస్ మండల బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు, విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కూన కొమరయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, ఖాసీంపేట ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, నాయకులు దొడ్డు మల్లేశం,బుర్ర అంజయ్య గౌడ్, మైసంపెళ్లి తిరుపతి, డాక్టర్ నర్సయ్య,ఏ. వెంకటరమణ, మంగరపు అనిల్, మునిగంటి రాములు తదితరులు పాల్గొన్నారు.
